తాగునీటి సమస్య లేకుండా చూడాలి
● జెడ్పీసీఈఓ పురుషోత్తం
కేసముద్రం: వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా పంచాయతీ కార్యదర్శులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జెడ్పీసీఈఓ పురుషోత్తం ఆదేశించారు. బుధవారం కేసముద్రం, ఇనుగుర్తి మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో జీపీ కార్యదర్శులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాలు, తండాల్లో ఎక్కడ తాగునీటి సమస్య ఉందనే విషయాన్ని, మిషన్ భగీరథ నీళ్లు రాని ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు క్రాంతి, హరిప్రసాద్, కార్యదర్శులు పాల్గొన్నారు.
హెచ్‌ఐవీ పరీక్షలు
చేయించుకోవాలి
దంతాలపల్లి: ప్రతిఒక్కరూ హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్ర ఎయిడ్స్ నిర్ధారణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శాంతకుమార్ తెలిపారు. సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యం వరంగల్ డాప్క్ ములుగు దిశ సమన్వయంతో బుధవారం మండల కేంద్రంలో మొబైల్ వ్యాన్‌లో హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్‌పై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించడానికే అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కుమారస్వామి, నాగేందర్‌బాబు, మానిటరింగ్ అధికారి రాయిశెట్టి యాకేందర్, బాలాజీ, సంధ్య, సారయ్య, సలేహా పాల్గొన్నారు.
ఉద్యోగుల పోస్టింగులపై ఆరా
నెహ్రూసెంటర్: నూతనంగా గ్రూపు–4లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వలేదు. దీంతో ఈ నెల 19వ తేదీన(బుధవారం) సాక్షిలో ‘కొత్త ఉద్యోగుల హైరానా’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన కలెక్టర్ ఉద్యోగుల కేటాయింపుపై ఆరా తీసి నివేదిక సమర్పించాలని అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారిని ఆదేశించారు. దీంతో బుధవారం అదనపు కలెక్టర్ డీఎంహెచ్‌ఓ కా ర్యాలయంలో గ్రూప్–4 ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులకు వెంటనే పోస్టింగుల ఇవ్వాలని సూచించినట్లు సమాచారం.
సీఎంఆర్ సకాలంలో
పూర్తి చేయాలి
మహబూబాబాద్: జిల్లాలోని రైస్ మిల్లుల యజమానులు సీఎంఆర్‌ను సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారి ఆదేశించారు. బుధవారం పట్టణంలోని శ్రీసాయి, జగదాంబ రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ధేశించిన లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేయాలన్నారు. సీఎంఆర్ వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిచారు. అదనపు కలెక్టర్ వెంట డీఎస్‌ఎస్‌ఓ ప్రేమ్‌కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి తదితరులు ఉన్నారు.
ఆయిల్‌పామ్ తోటల పరిశీలన
కురవి: మండల కేంద్రంలోని ఆయిల్‌పామ్, మామిడి తోటలను జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి జినుగు మరియన్న బుధవారం పరిశీలించారు. వేసవిలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. చిన్న మొక్కలకు రోజుకు 150–165 లీటర్ల నీటిని అందించాలని, ఎదిగిన చెట్లకు 250–330 లీటర్ల నీటిని అందించాలని సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పంటలను కాపాడుకోవాలన్నారు.
తాగునీటి సమస్య లేకుండా చూడాలి
తాగునీటి సమస్య లేకుండా చూడాలి
తాగునీటి సమస్య లేకుండా చూడాలి
తాగునీటి సమస్య లేకుండా చూడాలి
Comments
Please login to add a commentAdd a comment