శివాజీ ఆశయ సాధనకు కృషి
– మరిన్ని ఫొటోలు 9లోu
మహబూబాబాద్ అర్బన్: హిందూ సామ్రాజ్య స్థాపనకు పోరాడిన యోధుడు చత్రపతి శివాజీ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సిరికొండ సంపత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేవైఎం ఆధ్వర్యంలో బుధవారం శివాజీ జయంతిని పురస్కరించుకొని వేసి పాత, కొత్త బజారులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిరికొండ సంపత్ మాట్లాడుతూ అన్ని మతాలను సమానంగా ఆదరించి పరిపాలన చేసిన బహుజన వీరుడు చత్రపతి శివాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment