నాణ్యమైన విద్యుత్ అందించాలి
కొత్తగూడ/గంగారం: యాసంగి పంటలకు ఇబ్బందు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించాలని ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్ (ఆపరేషన్) వరంగల్ రాజు చౌహన్ తెలిపారు. బుధవారం కొత్తగూడ, గంగారం మండలాల్లోని సబ్ స్టేషన్లను పరిశీలించారు. లో ఓల్టేజీ సమస్యను అధికమించడానికి 600 కేవీఏఆర్ కెపాసిటర్ లైన్ పనులను పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగూడ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్‌లో జరుగుతున్న మరమ్మతు పనులు తనిఖీ చేశారు. అనంతరం రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలంటే ఆటోమేటిక్ స్టార్టర్లు తొలగించి కెపాసిటర్లు బిగించుకో వాలని రైతులకు సూచించారు. అలాగే గంగారం మండలంలోని చింతగూడెం గ్రామాన్ని సందర్శించిన చీఫ్ ఇంజనీర్ రాజు చౌహన్ విద్యుత్ సమస్యల ను అడిగి తెలుసుకున్నారు. ఉచిత కరెంట్ కోసం వినియోగదారులు ప్రజాపాలన దరఖాస్తుతో ఎంపీడీఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచించా రు. ఆయన వెంట మహబూబాబాద్ ఏడీఈ కవిత, కొత్తగూడ ఏఈ సురేష్, సిబ్బంది ఉన్నారు.
రైతులు ఆటోమేటిక్ స్టార్టర్లు తొలగించాలి
ట్రాన్స్‌కో సీఈ రాజు చౌహన్
Comments
Please login to add a commentAdd a comment