అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
మహబూబాబాద్ రూరల్: గంజాయి, ఇసుక, పీడీఎస్ బియ్యం సరఫరా, క్రయవిక్రయాలు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లాలోని పోలీసు అధికారులతో మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్ సమావేశ మందిరంలో బుధవారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ పోలీసులు తమ విధి నిర్వహణలో పారదర్శకంగా, నిజాయితీగా, జవాబుదారీతనంతో ఉండాలన్నారు. డీఎస్పీలు తప్పకుండా తమ పరిధిలోని పోలీస్‌స్టేషన్లను సందర్శించి పనితీరు సమీక్షించాలన్నారు. మహిళా సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, షీ టీమ్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరచిన పోలీసు సిబ్బందికి ప్రశంసపత్రాలు అందించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిషోర్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
Comments
Please login to add a commentAdd a comment