రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు సిద్ధం
బయ్యారం: నేటి నుంచి నాలుగు రోజుల పాటు వికారాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా జట్టును సిద్ధం చేశామని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మద్ది వెంకట్‌రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని క్రీడామైదానంలో నిర్వహించిన శిక్షణ శిబిరం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో జిల్లా జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా, మండల బాధ్యులు స్వామి, చాంప్ల, అనిల్, సంపత్‌యాదవ్, లచ్చిరాం, శ్రీనివాస్, విష్ణు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment