నేడు ‘డయల్ యువర్ డీఎం’
తొర్రూరు రూరల్: ఆర్టీసీ తొర్రూరు డిపో ఆధ్వర్యంలో శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మేనేజర్ పద్మావతి గురువారం తెలిపారు. ఉదయం 11నుంచి 12గంటల వరకు 99592 26053 నంబర్‌కు ఫోన్‌చేసి సలహాలు, సూచనలు చేయాలన్నా రు. బస్ సర్వీసులు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలియజేయాన్నారు.
వీరభద్రస్వామికి
హీరో గోపిచంద్ పూజలు
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారిని ప్రముఖ సినీహీరో గోపిచంద్ గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన పేరుతోపాటు కుటుంబసభ్యుల పేర్లపై గోత్రనామర్చనలు చేశారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు వేదాశ్వీరచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ ఈఓ సత్యనారాయణ మహాశివరాత్రి నుంచి జరగబోయే వీరభద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు. కుటుంబసమేతంగా స్వామివారి దర్శనానికి రావాలని కోరారు. ఆయన వెంట సినీనిర్మాత శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్త చిన్నం గణేశ్ ఉన్నారు.
వైద్యాధికారుల తనిఖీ
నెహ్రూసెంటర్: జిల్లా కేంద్రంలోని నిఖ్మా హెల్త్‌కేర్ సెంటర్ (శ్రీవెంకటేశ్వర నర్సింగ్ హోం)ను వైద్యారోగ్యశాఖ అధికారులు గురువారం తనిఖీ చేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రమీల ఆస్పత్రిలోని రోగుల రికార్డులు, అందుతున్న సేవలు, ల్యాబ్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్స్ కేవీ రాజు, గీత తదితరులు పాల్గొన్నారు.
కొత్త ఉద్యోగులకు
పోస్టింగులు
నెహ్రూసెంటర్: గ్రూప్–4 ఉద్యోగులకు పోస్టింగులు ఇచ్చారు. ఇటీవల గ్రూప్–4 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసి పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ మేరకు ఈ నెల 19న ‘సాక్షి దినపత్రిక’లో ‘కొత్త ఉద్యోగుల హైరానా’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై గురువారం అధికారులు స్పందించారు. ఉద్యోగులకు పోస్టింగులు ఇచ్చారు. దీంతో ఉద్యోగులు ‘సాక్షి దినపత్రిక’కు కృతజ్ఞతలు తెలిపారు.
రక్తహీనతపై అవగాహన కల్పించాలి
మహబూబాబాద్: రక్తహీనత వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కాకతీయ మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దయాకర్ అన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక లయన్స్ క్లబ్‌లో అయోడిన్ డెపిసెన్సీ–రక్తహీనత అనే అంశంపై అంగన్‌వాడీ టీచర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. రక్తహీనత వి షయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఐజీడీ కో ఆర్డినేటర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: కేంద్ర ప్రభుత్వ ఇంటర్న్‌షిప్ పథకం అమలుకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ డైరెక్టర్ మల్సూర్ గురువారం తెలిపారు. పథకం రెండో దశ నోటిఫికేషన్ వచ్చిందని, 21 నుంచి 24 మధ్య వయస్సు గల విద్యార్థులు మార్చి 11లోపు సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికై న విద్యార్థులకు ఏడాదిపాటు నెలకు రూ.5 వేల చొప్పున, ఒక్కసారి సాయం కింద రూ.6 వేలు అందుతాయన్నారు. 12 నెలల వ్యవధిలో కనీసం 6 నెలలు ఉద్యోగ శిక్షణ ఉంటుందన్నారు. దరఖాస్తుదారుల కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదని, పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లమా, డిగ్రీ పూర్తి చేసి ఉండాలన్నారు. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. 8లక్షలలోపు ఉండాలని, ఇతర వివరాలకు 1800 11 6090 టోల్ ఫ్రీ నంబర్‌లో సంప్రదించాలన్నారు.
నేడు ‘డయల్ యువర్ డీఎం’
నేడు ‘డయల్ యువర్ డీఎం’
Comments
Please login to add a commentAdd a comment