దాతల సాయం
తొర్రూరు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన ఫలితాల కోసం కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఖాళీ కడుపుతో విద్యార్థులు ఇబ్బంది పడవద్దని మధ్యాహ్న భోజనం కోసం దాతలను సంప్రదించారు. వారు పెద్ద మనసుతో విద్యార్థుల కడుపు నింపేందుకు అంగీకరించారు. జిల్లాలోని తొర్రూరు, కేసముద్రం, మహబూబాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ వార్షిక పరీక్షల వరకు దాతలు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం మూడు కళాశాలల్లో కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.
ఖాళీ కడుపుతో కళాశాలలకు..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటారు. దూర ప్రాంతాల నుంచి కళాశాలలకు వచ్చే వారికి ఇళ్ల నుంచి భోజనం తెచ్చుకోవడం ఇబ్బందిగా మారింది. ఉదయాన్నే తరగతులకు హాజరయ్యే హడావుడిలో ఏమీ తినకుండానే కళాశాలకు హాజరవుతున్నారు. ఆర్టీసీ బస్సుల సౌకర్యం లేని విద్యార్థులు ఆటోల ద్వారా కళాశాలకు వస్తున్నారు. కొందరు టిఫిన్ బాక్సుల్లో తెచ్చుకుంటున్న భోజనాలు తింటుండగా, మరికొందరు తాగునీటితోనే కడుపు నింపుకుంటున్నారు. జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వీరి పరిస్థితిని గమనించిన ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు దాతలను సంప్రదించడంతో మధ్యాహ్న భోజనం అందించేందుకు ముందుకు వచ్చారు. తొర్రూరులో మదర్ వలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు సిరికొండ విక్రమ్‌కుమార్‌ను సంప్రదించగా పలువురు దాతలతో మాట్లాడి మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. కేసముద్రం, మహబూబాబాద్ కళాశాలల్లోనూ దాతలు చేయూత అందిస్తున్నారు.
ఇంటర్ కళాశాలల్లో
మధాహ్న భోజనానికి దాతృత్వం
జిల్లాలోని మూడు కళాశాలల్లో అమలు
Comments
Please login to add a commentAdd a comment