మాదక ద్రవ్యాలను నియంత్రించాలి
మహబూబాబాద్: జిల్లాలో మాదక ద్రవ్యాలను నియంత్రించాలని, వాటి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారితో కలిసి సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల నివారణకు పోలీస్‌శాఖ కృషి చేస్తుందని, ఇతర శాఖలు సహకారం అందించాలన్నారు. జిల్లాలో గంజాయి రవాణాను అరికట్టేదిశగా దృష్టి సారించాలన్నారు. కళాజాత బృందాల ప్రదర్శనలు, ర్యాలీలు పలు ఇతర కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రత్యేకించి గంజాయి వివి ధ మార్గాల ద్వారా రవాణా అవుతుందని, ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు. మాదక ద్రవ్యాల రవాణా, ఉత్పత్తి చట్ట వ్యతిరేక చర్య అన్నా రు. యువతీ యువకులు మాదక ద్రవ్యాలకు బా నిసై తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దన్నారు. మెడికల్ విభాగం ఆధ్వర్యంలో డీ– అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మానుకోట, తొర్రూరు ఆర్డీఓలు కృష్ణవేణి, గణేశ్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ వెంకట్, డీఎంహెచ్‌ఓ మురళీధర్, ప్రభుత్వ ఆస్పత్రి సూపరిటెండెంట్ శ్రీనివాసరావు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
చర్యలు తీసుకోవాలి
జిల్లాలో వేసవికాలంలో నీటిఎద్దడి ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో నీటి ఎద్దడిపై మిషన్ భగీరథ, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి పైప్‌లైన్ మరమ్మతులు, ఇతర పనులు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీపీఓ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తనిఖీ చేయాలి..
జిల్లాలోని వసతిగృహాలను జిల్లా, ప్రత్యేక అధికారులు తనిఖీ చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో హాస్టళ్ల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. హాస్టళ్లలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమస్యలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్
Comments
Please login to add a commentAdd a comment