మార్కెట్‌లో వాకీటాకీలతో సమాచారం
కేసముద్రం: ప్రజాభద్రత కోసం పోలీసులు వాకీటాకీలను ఉపయోగించడం సహజంగా చూస్తుంటాం. కానీ రాష్ట్రంలో ఏ మార్కెట్‌లో లేని విధంగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో కొత్తగా వాకీటాకీలను అమల్లోకి తీసుకువచ్చారు. ఇటీవల మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి ప్రత్యేక చొరవతో అధికారులు, సిబ్బందికి 10 వాకీటాకీలను అందజేశారు. మార్కెట్ యార్డుల్లో సరుకులను ఖరీదు చేసే సమయంలో, కాంటాలు, తొలకాలు జరిగేటప్పుడు, ఏమైనా సమస్యలు తలెత్తినా వెంటనే సిబ్బంది అప్రమత్తమై తమ వద్దనున్న వాకీటాకీల ద్వారా అధికారులకు సమాచారం అందిస్తున్నారు. మార్కెట్ యార్డుల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు మార్కెట్ అధికారులు వాకీటాకీల ద్వారా తెలుసుకుంటూ సిబ్బందికి తగు సూచనలు చేస్తున్నారు. సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం, సమస్యలు తెలుసుకొని, వెంటనే పరిష్కరిస్తున్నామని స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ అమరలింగేశ్వర్‌రావు తెలిపారు.
కేసముద్రం మార్కెట్‌లో అమలు
మార్కెట్‌లో వాకీటాకీలతో సమాచారం
Comments
Please login to add a commentAdd a comment