బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
స్టేషన్‌ఘన్‌పూర్ : ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో పడడంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతుడి భార్య నూర్జహాన్, పోలీసుల కథనం ప్రకారం.. చిల్పూరు మండలం చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన ఎండీ.జమాలుద్దీన్ పశు వైద్యశాలలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున పాంనూర్‌కు వెళ్తుండగా బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై వినయ్‌కుమార్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment