వైద్యుడు చనిపోయాడనే వెళ్లిపోయారా?
కాజీపేట సిద్దార్ధనగర్‌లోని షిర్డిసాయినగర్‌కు చెందిన డాక్టర్ గాదె సుమంత్ రెడ్డి (37) జనరల్ ఫిజీషియన్. గురువారం రాత్రి క్లినిక్ మూసివేసి స్నేహితుడిని కలిసేందుకు భట్టుపల్లి మీదుగా వరంగల్‌కు బయల్దేరగా.. గుర్తు తెలియని దుండగులు కారును అడ్డగించి.. దాడి చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చనిపోయి ఉంటాడని భావించి దుండగులు వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు. సుమంత్ రెడ్డి తండ్రి ఆరోగ్య సుధాకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు శుక్రవారం మిల్స్‌కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీపీ ఆదేశాల మేరకు పోలీసులు మరోసారి ఘటన స్థలానికి చేరుకుని, క్షుణ్ణంగా పరిశీలించారు. దుండుగులు ఎలా వచ్చి ఉంటారూ.. తిరిగి ఎలా వెళ్లిపోయారు.. దాడి చేసింది ఎవరై ఉంటారు.. అనే విషయాలపై చర్చించుకున్నారు. కాగా, సుమంత్‌రెడ్డి కారును మరో కారులో దుండగులు కాజీపేటనుంచే వెంబడించగా, మరికొందరు ఘటనస్థలి వద్ద కాపుకాసినట్లు తెలిసింది. ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. దాడికి వివాహేతర సంబంధమా.. మరే ఇతర కారణమా అనేది తెలియాల్సి ఉంది.
వైద్యుడు చనిపోయాడనే వెళ్లిపోయారా?
వైద్యుడు చనిపోయాడనే వెళ్లిపోయారా?
Comments
Please login to add a commentAdd a comment