పరిశోధనలతో జ్ఞాన సముపార్జన
కేయూ క్యాంపస్ : ‘వన్ నేషన్–వన్ సబ్‌స్క్రిప్షన్’ ద్వారా పరిశోధన వనరులు అందుబాటులో ఉన్నాయి. దీంతో పరిశోధనలకు అవసరమైన జ్ఞాన సముపార్జనకు దోహదం చేస్తోందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం పేర్కొన్నారు. కేంద్ర గ్రంథాలయం, లైబ్రరీ సైన్స్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం కేయూలోని సెనేట్‌హాల్‌లో నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బెంగళూరు ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్‌వర్క్ సంచాలకులు ప్రొఫెసర్ దేవిక పి మదాలి కీలకపోన్యాసం చేస్తూ గతంలో చాలా విలువైన జర్నల్స్ కొద్దిమంది పరిశోధకులకు మాత్రమే అందుబాటులో ఉండేవని వివరించారు. ఇప్పుడు వన్ నేషన్–వన్ సబ్‌స్క్రప్షన్ ద్వారా యాక్సెస్ పెరిగిందన్నారు. దేశంలోని అన్ని వ్యక్తిగత విభాగాలకు చెందిన ప్రముఖ ప్రచురణ కర్తల నుంచి పరిశోధన జర్నల్స్‌కు ప్రాధాన్యత అందించడం దార్శనికత ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ సదస్సులో వివిధ విభాగాల డీన్లు మాట్లాడారు. విద్యార్థులు, పరిశోధకులు, లైబ్రరీ విభాగం బోధన, బోధనేతర ఉద్యోగులు పాల్గొన్నారు.
జాతీయ సదస్సులో కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం
Comments
Please login to add a commentAdd a comment