శుక్రవారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2025
– IIలోu
టాయిలెట్స్ అందుబాటులో లేక అవస్థలు
● స్కూల్‌కు దూరంగా వెళ్లి మూత్రవిసర్జన
● మన ఊరు–మన బడి, అమ్మ ఆదర్శ
పాఠశాలల పనులు పెండింగ్
● బిల్లులు రాక పూర్తి చేయని కాంట్రాక్టర్లు
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అనుగుణంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. ఉన్నచోట నీటి వసతి లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం హయాంలో ప్రవేశపెట్టిన మన ఊరు–మన బడి కార్యక్రమం, ప్రస్తుత సర్కారు ప్రవేశపెట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు ముందుకు సాగడంలేదు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పూర్తి చేసినా.. అధికారులు కావాలనే బిల్లులు చేయడంలేదని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. దీంతో జిల్లాలోని పలు మండలాల్లో 145 పనులు చేపట్టినప్పటికీ పాఠశాలలకు అప్పగించలేదు.
ఆరుబయటే మూత్రవిసర్జన..
కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మంగారితండా ప్రాథమిక పాఠశాలలో 18 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఈ పాఠశాలకు భవనం లేదు. దీంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టే మహిళ ఇంటి ఆవరణలో బోధన చేపడుతున్నారు. దీంతో మూత్రశాల లేకపోవడం వల్ల ప్రతీరోజు తండా శివారులోని ఎస్సారెస్పీ ఉపకాల్వ వైపు వెళ్లి విద్యార్థులు మూత్ర విసర్జన చేసి వస్తున్నారు.
న్యూస్‌రీల్
విద్యార్థుల ఇక్కట్లు..
విద్యార్థుల ఇక్కట్లు..


