● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
తొర్రూరు: తొర్రూ రు మున్సిపాలిటీని అభివృద్ధి చేయడంతో పాటు అన్ని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తెలిపారు. పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు. తాగునీటి ఎద్దడి నివారణకు అమృత్ పథకం కింద హరిపిరాల రోడ్డులో కొనసాగుతున్న పైపులైన్ పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం మినీ ట్యాంక్‌బండ్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా వార్డుల్లో అసంపూర్తిగా మిగిలిపోయిన డ్రెయినేజీలు, సీసీ రోడ్లను పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తొర్రూరు మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి నిదుల కోసం టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్‌ను కలిసి విన్నవించినట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీలో అంతర్గత రహదారులు, డ్రెయినేజీ వ్యవస్థ మెరుగుదల, తాగునీటి సరఫరా, స్మార్ట్ లైటింగ్ వంటి సదుపాయాల విస్తరణ చేపడుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, నాయకులు జినుగ సురేందర్‌రెడ్డి, గంజి విజయ్‌పాల్‌రెడ్డి, సోమ రాజశేఖర్, తూనం శ్రావణ్, సురేశ్, మహేశ్, కిషన్ పాల్గొన్నారు.


