స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్ పర్వతం రామకృష్ణ, ప్రైవేట్ అటెండర్ ఎదునూరి రమేశ్ రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటన గురువారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పర్వతం రామకృష్ణ కొన్ని నెలలుగా స్టేషన్‌ఘన్‌పూర్ ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా, ఎదునూరి రమేశ్ చాలా ఏళ్లుగా ఈ కార్యాలయంలో ప్రైవేట్ అటెండర్‌గా పనిచేస్తున్నాడు. సబ్ రిజిస్ట్రార్‌లకు సంబంధించిన లావాదేవీలు రమేశ్ చేతులమీదుగానే నడుస్తుంటాయి. ఈ క్రమంలో చిల్పూరు మండలం వెంకటేశ్వరపల్లెకు చెందిన బట్టమేకల యాదగిరికి శివరాజ్, ధర్మరాజ్ ఇద్దరు కొడుకులు. తండ్రి పేరిట ఉన్న 585 గజాల స్థలంలోని ఇల్లు, ఇంటి స్థలాన్ని పంచుకున్నారు. ఆ ఆస్తిని తమ పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శివరాజ్ ఈనెల 17న ఘన్‌పూర్ సబ్ రిజిస్ట్రార్‌ను సంప్రదించగా పార్టీషన్ గిఫ్ట్ డీడ్ చేయమని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అఽధ్యక్షుడినని, ఇద్దరు అన్నదమ్ములకు చేయాలని కోరినా వినిపించుకోలేదు. తర్వాత రెండు డాక్యుమెంట్లు చేయాల్సి ఉంటుంది.. ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.11వేల చొప్పున రూ.22 వేలు ఇస్తే చేస్తామని అటెండర్ రమేశ్ ద్వారా శివరాజ్‌కు చెప్పించారు. అంత ఇచ్చుకోలేనని వేడుకోవడంతో చివరకు రూ.20వేలు ఇవ్వాలని చెప్పడంతో చేసేది లేక వెళ్లిపోయాడు. ఈ క్రమంలో శివరాజ్ 18న హనుమకొండలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించి విషయం తెలిపారు. రెండు రోజులుగా నిఘా వేసిన ఏసీబీ అధికారులు గురువారం మధ్యాహ్నం శివరాజ్ ద్వారా సదరు లంచం డబ్బులు సబ్ రిజిస్ట్రార్.. అటెండర్ రమేశ్ ద్వారా తీసుకున్నాడు. అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అటెండర్ రమేశ్‌ను, సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణను పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు సట్ల రాజు, ఎల్.రాజు తదితరులు పాల్గొన్నారు.
● గిఫ్ట్ రిజిస్ట్రేషన్‌కు
రూ.20 వేలు డిమాండ్
● ఘన్‌పూర్‌లో లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం


