● ఆర్టీసీ ఆర్‌ఎం విజయభాను
హన్మకొండ: భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు ఇంటివద్దనే అందించనున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను తెలిపారు. ఏప్రిల్ 6వ తేదీ భద్రాచలంలో సీతారాముల కల్యాణం జరుగుతుందని తెలిపారు. గురువారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో సీతారాముల కల్యాణ పోస్టర్‌ను ఆర్‌ఎం, అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులకు ఆర్టీసీ లాజిస్టిక్, పార్సిళ్ల ద్వారా తలంబ్రాలు అందించనున్నట్లు వివరించారు. తలంబ్రాల ఒక్కొక్క ప్యాకెట్‌కు రూ.151 చెల్లించాలన్నారు. ఆర్టీసీ ఆన్‌లైన్‌లో, అన్ని బస్టాండ్‌లోని లాజిస్టిక్స్ సెంటర్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ల వద్ద గాని బుక్ చేసుకోవచ్చన్నారు. ఉమ్మడి జిల్లా వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వరంగల్–1 డిపో ఎగ్జిక్యూటివ్ ఎస్.రామయ్య (9154 298759), వరంగల్–2 డిపో పి.నరేందర్ (9154298763), హనుమకొండ డిపో సతీశ్ కుమార్(9154298761), జనగామ కె.వినాశ్ (9154298762), వి.శివ కుమార్(9154298764), నర్సంపేట పి.నరేందర్ (9154298763), మహబూబాబాద్ ఎస్. వేలాద్రి (9154298768), తొర్రూరు పి.చైతన్య కుమార్(9154298766), భూపాలపల్లి వి.శివ కుమార్ (915 4298764), వరంగల్ రీజియన్ ఎం. నవత (9154298758, 9398411765)ను సంప్రదించాలని ఆర్‌ఎం కోరారు.


