మహబూబాబాద్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల లక్ష్యం పూర్తి చేసేందుకు అధికారుల సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఉపాధి పనులు, ఎల్‌ఆర్‌ఎస్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కూలీల సంఖ్య పెంచి వందరోజుల పని దినాలు కల్పించాలన్నారు. మార్చి 31 లోపు ఇంటి పన్ను వంద శాతం వసూళ్లు పూర్తి చేయాలన్నారు. వీసీలో డీఆర్‌డీఏ పీడీ మధుసూదన్‌రాజు, డీపీఓ హరిప్రసాద్, పీఆర్ ఈఈ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
రైతులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
నెహ్రూసెంటర్: రైతులు వ్యవసాయానికి అనుకూలంగా లేని వ్యవసాయ క్షేత్రాల్లో సోలార్ విద్యుత్‌ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని అదనపు కలెక్టర్ లెనిన్‌వత్సల్ టొప్పో అన్నారు. విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో రైతులకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, పీఎం కుసుమ్‌పై అవగాహన సదస్సును సర్కిల్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. సోలార్ విద్యుత్‌ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. విద్యుత్‌శాఖ ఎస్‌ఈ జనగం నరేశ్ మాట్లాడుతూ జిల్లాలో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు 126 మంది దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు 25 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో డీఈ పెద్ది రాజం, మధుసూదన్, విజయ్, రాజ్యలక్ష్మీ, ప్రశాంత్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ లెనిన్‌వత్సల్ టొప్పో


