మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న పీఈటీల, పీడీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ వ్యాయామవిద్య ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుని విజయ్‌సాగర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శనిగపురం ప్రభుత్వ పాఠశాలలో శనివారం వ్యాయామవిద్య ఉపాధ్యాయ సంఘం జిల్లా ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌సాగర్ హాజరై మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీపీఈడీ అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి పదోన్నతులు కల్పించామని, సీఆర్టీలుగా, ఆర్‌ఎంఎస్‌ఏ పీఈటీలుగా ఉన్న వారికి మినిమం టైం స్కేల్ ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు.
అనంతరం వ్యాయామవిద్య ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా వాసిరెడ్డి ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా బి.చాంప్లనాయక్, కోశాధికారిగా మహాంకాళి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగరాజుగౌడ్, వివిధ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంగీలాల్, రంగారెడ్డి, సిద్దార్ధ్, ఇమ్రాన్, కొమ్మలు, ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
పీఈటీల సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌సాగర్


