సంకీర్ణ ప్రభుత్వాలతోనే సుస్థిర పాలన | - | Sakshi
Sakshi News home page

సంకీర్ణ ప్రభుత్వాలతోనే సుస్థిర పాలన

Mar 23 2025 9:16 AM | Updated on Mar 23 2025 9:10 AM

కేయూ క్యాంపస్‌ : సంకీర్ణ ప్రభుత్వాలతో సుస్థిర పాలన సాధ్యమని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. కేయూ రాజనీతిశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులుగా సెనేట్‌హాల్‌లో ‘భారత సమాజంలో సంకీర్ణ ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యం’ అనే అంశంపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శనివారం సాయంత్రం ముగిసింది. ఈ ముగింపు సభలో వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సంకీర్ణ రాజకీయాలు, ప్రభుత్వాలు బహుళ వర్గాల ప్రజల ఐక్యతకు ప్రతీకయే గాకుండా ప్రజలకు జవాబుదారీగా వ్యవహరిస్తాయన్నారు.

సంకీర్ణ రాజకీయాలతోనే ప్రజాస్వామ్యం బలోపేతం

ప్రజాస్వామ్యం బలోపేతం, సంపదకేంద్రీకరణ సంకీర్ణ రాజకీయాలతోనే సాధ్యమని ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్‌ సైన్స్‌ విభాగం రిటైర్డ్‌ ఆచార్యలు కె. శ్రీనివాసులు అన్నారు. ఈ సదస్సులో ఆయన ప్రధానవక్తగా పాల్గొని మాట్లాడారు. సంకీర్ణం కేవల రాజకీయాలకు మాత్రమే కాదని ఆర్థిక సామాజికంలోనూ అవసరం అన్నారు. సంకీర్ణణానికి భారతీయ జాతీయ ఉద్యమం గొప్ప ఉదాహరణ అన్నారు. అనంతరం కేయూ రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం, పొలిటికల్‌ సైన్స్‌ విభాగం అధిపతి సంకినేని వెంకట్‌, యూజీసీ కోఆర్డినేటర్‌ ఆర్‌.మల్లికార్జున్‌రెడ్డి, మద్రాస్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ మాట్లాడారు. ఆ విభాగం బీఓఎస్‌ చైర్మన్‌ గడ్డం కృష్ణయ్య, రిటైర్డ్‌ ఆచార్యులు రఘురాంరెడ్డి, జి వీరన్న,హరిప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ సదస్సులో 9 సెషన్లలో వంద మంది పరిశోధన పత్రాలు సమర్పించారు. ఈ పరిశోధన పత్రాలను పుస్తకం రూపంలోకి తీసుకురాగా వీసీ, రిజిస్ట్రార్‌ పొలిటికల్‌ సైన్స్‌ విభాగం రిటైర్డ్‌ ఆచార్యులు ఆవిష్కరించారు.

కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి ముగిసిన జాతీయ సదస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement