సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోu
విద్యుత్‌శాఖలో సిబ్బంది లేక ఇబ్బంది
● 105జేఎల్‌ఎం పోస్టుల్లో 93 వెకెన్సీ..
● ఆపరేటర్లు లేక నిరుపయోగంగా సబ్‌స్టేషన్లు
● ఫ్యూజ్‌పోతే గంటల తరబడి ఎదురుచూపులు
నిరుపయోగంగా తాళ్లపూసపల్లి సబ్‌స్టేషన్
సాక్షి, మహబూబాబాద్: విద్యుత్ విలాస వస్తువు నుంచి నిత్యావసరంగా మారింది. కరెంట్ లేకపోతే అంతా ఉక్కిరి బిక్కిరి.. ఎక్కడి పనులు అక్కడే.. ఇంతటి ప్రాధాన్యత ఉన్న విద్యుత్ శాఖలో సరిపడా సిబ్బంది, ఉద్యోగులు లేక ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గతంతో పోలిస్తే విద్యుత్ కనెక్షన్లు, వినియోగం పెరిగింది. కానీ అందుకు అనుగుణంగా ఉద్యోగుల నియామకం జరగకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతుందని అధికారులు చెబుతున్నారు.
పెరిగిన వినియోగం..
జిల్లా వ్యాప్తంగా రోజురోజుకూ విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో గృహ అవసరాల కోసం 2,17,294 కనెక్షన్లు, కమర్షియల్ 22,927, పరిశ్రమలకు1,287, కుటీర పరిశ్రమలకు 373, వ్యవసాయ పంపుసెట్లకు 93,422, వీధి దీపాలకు 3,104, తాగునీటి సరఫరాకు 1,577, గుడి, బడికి 1,380, తాత్కాలిక అవసరాల కోసం 165, మొత్తం 3,41,530 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఈమేరకు జిల్లాలో ఏడు 133/33 కేవీ సబ్‌స్టేషన్లు, రెండు 220/130 సబ్‌స్టేషన్లు ఉన్నాయి. అలాగు 72 చోట్ల 33/11 కేవీ సబ్‌స్టేషన్లు ఉన్నాయి. కాగా లోడు పెరగడంతో తాళ్లపూసపల్లి, రామచంద్రాపురం, నర్సింహులగూడెం, సత్యనారాయణపురం ప్రాంతాల్లో ఇటీవల 33/11 కేవీ సబ్‌స్టేషన్లు నిర్మించారు. కేసముద్రం, బత్తులపల్లి, ఉప్పరపల్లి, సోమ్లాతండా, వేంనూరు, రాంచంద్రాపురం, మట్టెవాడ, కోమట్లగూడెం ప్రాంతాల్లో కొత్త సబ్‌స్టేషన్లు అవసరమని గుర్తించారు. కొన్నిచోట్ల స్థల సేకరణ కూడా చేశారు.
వెంటాడుతున్న ఉద్యోగుల కొరత..
పెరిగిన విద్యుత్ వినియోగానికి అనుగుణంగా కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణాలు చేపట్టడంతో పాటు మరి కొన్ని చోట్ల ఏర్పాటుకు రూపకల్పన చేస్తున్నారు. అయితే ఇందుకు అనుగుణంగా సిబ్బంది, ఉద్యోగులను నియమించడం లేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో ప్రతీ గ్రాపంచాయతీకి ఒక హెల్పర్, పెద్ద పంచాయతీలకు లైన్‌మెన్, మండలానికో ఏఈ ఉండేవారు. అయితే జిల్లా ఆవిర్భావం తర్వాత ప్రస్తుతం 18 మండలాలు, 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే ఇందుకు అనుగుణంగా కొత్త పోస్టుల మంజూరు లేకపోగా.. మంజూరైన 109 జూనియర్ లైన్‌మెన్ల పోస్టులకు గాను కేవలం 16 పోస్టులే భర్తీ చేశారు. అంటే ఒక్క జేఎల్‌ఎం పోస్టులే 93 ఖాళీలు ఉన్నాయి. అదే విధంగా హెల్ప ర్ల వ్యవస్థ లేకపోవడంతో అన్‌మ్యాన్డ్, ఆర్టిజన్ పేరిట కాంట్రాక్టు ఉద్యోగులను నియమించినా.. అవి కూడా కొన్నిచోట్లకే పరిమితం అయ్యాయి. దీంతో గ్రామాల్లో చిన్నపాటి మరమ్మతు వచ్చినా.. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడటం, సబ్‌స్టేషన్ల పర్యవేక్షణ చేపట్టాల్సిన ఆపరేటర్ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. ఒక్కో సబ్‌స్టేషన్‌కు ముగ్గురు చొప్పున జిల్లాలోని 72 సబ్‌స్టేషన్లకు 216 మంది ఆపరేటర్లు ఉండాలి. కానీ మొత్తం 140 మంది మాత్రమే పనిచేస్తుండగా 76ఆపరేటర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉన్న వారిపైనే అదనపు భారం పడి డబుల్ డ్యూటీలు చేయాల్సి వస్తోంది. ఈమేరకు ఇటీవల నాలుగు సబ్‌స్టేషన్ల నిర్మాణాలు పూర్తికాగా.. ఆపరేటర్లు లేకపోవడంతో మూడు సబ్‌స్టేషన్లు నిరుపయోగంగా మారాయి. ఒకవైపు సరిప డా సిబ్బంది లేక.. మరోవైపు నిర్మించిన సబ్‌స్టేషన్లు అందుబాటులోకి రాకపోవడంతో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది.
న్యూస్‌రీల్
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం
జిల్లాలో ఏఎల్‌ఎంల కొరత ఉన్నది వాస్తవమే. దీంతో కొత్త సబ్‌స్టేషన్లను ప్రారంభించడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. వారి ఆదేశాల మేరకు అపరేటర్ల నియామకం చేపడుతాం. మరికొద్దిరోజుల్లో కొత్త జేఎల్‌ఎం నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. కొత్త జేఎల్‌ఎంలు వస్తే ఇబ్బందులన్నీ తొలుగుతాయి.
– జనగాం నరేశ్, ఎస్‌ఈ, మహబూబాబాద్
సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025
సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025
సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025


