హసన్‌పర్తి: పంప్‌హౌస్‌ను సందర్శించి వస్తాం.. లోనికి పంపిస్తారా.. లేదంటే ఇక్కడే బైఠాయించా లా అని మాజీ మంత్రి దయాకర్‌రావు అన్నారు. దేవన్నపేటలో నిర్మించిన దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పంప్ హౌస్‌ను బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం ఆదివారం సందర్శించడానికి వెళ్లింది. ముందు జాగ్రత్తగా కాజీపేట ఏసీపీ తిరుమల్ ఆధ్వర్యాన భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పంప్‌హౌస్ వద్దకు చేరుకోవడానికి ముందే బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. లోనికి పంపిస్తారా.. రోడ్డుపై బైఠాయించాలా? అని బీఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నించడంతో.. వారిని రెండు విడతలుగా వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. మొదటి విడతలో మాజీ మంత్రి దయాకర్‌రావు, మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డితో పాటు మరికొంత మంది కి, రెండో విడతలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటి కొండరాజయ్యను అనుమతించారు. అనంతరం పల్లా, ఎర్రబెల్లి మా ట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలోనే దేవాదుల ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తయ్యాయని, కాంగ్రెస్ సర్కార్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయన్నారు. దీంతో వేలాది ఎకరాల పొలాలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బండి రజనీకుమార్, మాజీ సర్పంచ్‌లు చుంచు రవి, కొండపాక రఘు, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు, ఏనుగుల రాజేష్‌రెడ్డితో పాటు దివ్యారాణి, రాజునాయక్, యాదగిరి, చింతం సదా నందం తదితరులు పాల్గొన్నారు.
పోలీసులతో ‘ఎర్రబెల్లి’ వాగ్వాదం
దేవాదుల పంప్‌హౌస్‌ను సందర్శించిన బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం


