కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి హుండీ ఆదాయం రూ.41,35,045 వచ్చినట్లు ఆలయ ఈఓ సత్యనారాయణ, చైర్మన్ కొర్ను రవీందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆలయంలో 17 హుండీల్లో భక్తులు సమర్పించుకున్న కానుకలను దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆర్.సమత సమక్షంలో లెక్కించారు. గత ఏడాది డిసెంబర్ 26నుంచి ఈనెల 24వ తేదీ వరకు హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలు రూ.41,35,045వచ్చినట్లు వారు వివరించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్, శక్రునాయక్, కె.ఉప్పలయ్య, చిన్నం గణేశ్, జనార్దన్‌రెడ్డి, సత్యనారాయణ, సంజీవరెడ్డి, ఆలయ సిబ్బంది, మానుకోటకు చెందిన లక్ష్మీ శ్రీనివాస సేవాట్రస్ట్, మణుగూరుకు చెందిన ఉమాశంకర్‌రావు శ్రీ వారి ట్రస్ట్ భక్తమండ లి సభ్యులు 280 మంది లెక్కింపులో పాల్గొన్నారు.


