● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
మహబూబాబాద్ రూరల్: ట్రాఫిక్ పోలీసు సిబ్బంది అంకితభావంతో సేవలందిస్తున్నారని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి ఎస్పీ ప్లాస్క్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అండర్ బ్రిడ్జి మూసివేసిన సమయంలో రైల్వే గేట్ సమీపంలో ట్రాఫిక్‌ను సమర్థవంతంగా పర్యవేక్షించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలందించారని సిబ్బందిని కొనియాడారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, ఎస్బీ సీఐ చంద్రమౌళి, టౌన్ సీఐ దేవేందర్, ఆర్‌ఐలు అనిల్, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.
భూసేకరణ సర్వే నిర్వహణ
డోర్నకల్: డోర్నకల్ బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూసేకరణ కోసం రెవెన్యూ సిబ్బంది బుధవారం సర్వే చేపట్టారు. రోడ్లు భవనాలశాఖ ఆధ్వర్యంలో గార్ల గేటు నుంచి యాదవనగర్ మీదుగా సమ్మర్ స్టోరేజీ వద్ద బలపాల రోడ్డు వరకు రూ.6 కోట్ల నిధులతో 1.7 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు మంజూరయ్యాయి. 2023 అక్టోబర్ 2న పనులకు శంకుస్థాపన చేశారు. కాగా పను ల జాప్యంపై ఈనెల 17న సాక్షి దినపత్రికలో ‘పనులు చేపట్టేదెప్పుడో?’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై స్పందించిన రెవె న్యూ, ఆర్ అండ్ బీ సిబ్బంది భూసర్వే చేపట్టారు. బైపాస్ రోడ్డుకు అవసరమైన 7.29 ఎకరాల భూమిలో సర్వే నిర్వహించి ఆర్‌డీఓకు నివేదిక అందించనున్నట్లు సర్వేయర్ వెంకన్న తెలిపారు.
ట్రాఫిక్ సిబ్బంది సేవలు అభినందనీయం


