తండ్రిపై కుమారుడు, కోడలు దాడి
● తీవ్రంగా గాయపడిన వృద్ధుడు
● బమ్మెరలో ఘటన
పాలకుర్తి టౌన్: భూ వివాదం నేపథ్యంలో స్థా నిక తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడనే కోపంతో తండ్రిపై కుమారుడు, కోడలు దాడికి పాల్పడిన ఘటన పాలకుర్తి మండలం బమ్మెరలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ వైద్యం చేయించుకోవడానికి చేతిలో చిల్లి గవ్వ లేక కొడుకులకు రాసిచ్చిన భూమి రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఈనెల 25న తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్‌లో గ్రామానికి చెందిన దుంప సోంమల్లు ఫిర్యాదు చేశాడు. తండ్రి బయటకు వెళ్లిన కొద్ది సేపటికే పెద్ద కుమారుడు వచ్చి తన భూమిని విక్రయించేందుకు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటికే వృద్ధుడి గోడు విని చలించిన తహసీల్దార్ శ్రీనివాస్.. తండ్రికి ఇస్తాన్నన డబ్బు ఇవ్వలేని పక్షంలో ముగ్గురి కుమారుల పేరిట చేసిన భూ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తానని హెచ్చరించాడు. తండ్రి ఇవ్వాల్సిన డబ్బు రూ.3 లక్షలు ఇచ్చేది లేదని బుధవారం చిన్న కుమారుడు ఐలయ్య, కోడలు ఐలమ్మ.. సోంమల్లుపై దాడికి పాల్పడ్డాడరు. ఈ ఘటనలో సోంమల్లు తల పగిలింది. వెంటనే చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్ప్రతికి తరలించారు. కాగా, సోంమల్లు నెల క్రితం తనకు న్యాయం చేయాలని జిల్లా లీగల్ సర్వీస్‌లో కూడా ఫిర్యాదు చేశాడు.
పర్యావరణ సమతుల్యత పాటించాలి
● కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్: వనరులను సంరక్షించుకునేందుకు,పర్యావరణ సమతుల్యతను పెంపొందించుకునేందుకు మెటీరియల్ సైన్స్ దోహదపడుతుందని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. నగరంలోని పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాలలో ‘ఇంటర్ డిసిప్లినరీ మెటీరియ ల్స్ సైన్స్ ఫర్ సస్టేనబుల్ ఎనర్జీ అండ్ ఎన్వి రాన్మెంట్ (ఎన్‌సీఐఎంఎస్‌ఎస్‌ఈఈ–2025)’ అంశంపై రెండ్రోజుల జాతీయ సదస్సు బుధవారం హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణలు సృజనాత్మక ఆలోచనలతో సుస్తిరాభివృద్ధిలో భాగం కావాలని, వివిధ రకాల నైపుణ్యాల్ని వినియోగించుకోవాలని సూచించారు. వరంగల్ ఎన్‌ఐటీ ఫిజిక్స్ ప్రొఫెసర్ డి.హరినాథ్, సదస్సు కన్వీనర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.అరుణ, ఎన్‌వైకే డిప్యూటీ డైరెక్టర్ సీహెచ్.అన్వేశ్, వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, కో–కన్వీనర్ కవిత, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ సురేశ్‌బాబు, అకడమిక్ కో–ఆర్డినేటర్ అరుణ, అధ్యాపకులు హెప్సిబా, ప్రవీణ్‌కుమార్, పాల్గొన్నారు.
గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాడని..


