లింగాలఘణపురం : మండలంలోని మాణిక్యాపురం గ్రామానికి చెందిన వడగం భాస్కర్ (45) బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్ వెళ్లి అక్కడ ఓ కంపెనీలో పని చేస్తూ దుర్మరణం చెందాడు. గ్రామంలో ఉపాధి లేక సుమారు పదిహేనేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. జగద్గిరిగుట్టలోని ఓ పైపుల కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం రోజువారీగా పనికి వెళ్లిన భాస్కర్.. లిఫ్ట్‌లో ఏర్పడిన లోపంతో ఒక్కసారిగా పైనుంచి కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. భాస్కర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, భాస్కర్ పదో తరగతి స్నేహితులు (1994–1995 బ్యాచ్) ఆ కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో మబ్బు మల్లేశం, జహింగాచారి, సురేశ్, రమేశ్, రాజు, శ్రీనివాస్, శ్రీధర్, భాస్కర్, బ్రహ్మం తదితరులు ఉన్నారు.
లిఫ్ట్ నుంచి పడి వ్యక్తి దుర్మరణం
హైదరాబాద్‌లో మండల వాసి మృతి


