ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మకు భక్తులు మొక్కుగా సమర్పించిన బంగారం, వెండి మిశ్రమాన్ని దేవాదాయశాఖ అధికారులు గురువారం తూకం వేశారు. బుధవారం మినీ జాతర హుండీల కానుకలు లెక్కించిన విషయం తెలిసిందే. 2024లో జరిగిన మహాజాతర తర్వాత భక్తులు సమర్పించిన బంగారం, వెండి మిశ్రమాన్ని అధికారులు సీల్ వేసి హుండీల్లోనే ఉంచారు. మినీ జాతర వరకు వచ్చిన బంగారం, వెండి మిశ్రమాన్ని పూజారుల సమక్షంలో స్వర్ణకారుడితో తూకం వేయించారు. సమ్మక్క హుండీలో బంగారం 42 గ్రాములు, వెండి 3కిలోల 110 గ్రాములు, సారలమ్మ హుండీలో బంగారం 14 గ్రాములు, వెండి 2కిలోల 500 గ్రాములు భక్తులు సమర్పించినట్లు ఈఓ రాజేంద్రం తెలిపారు. ఈకా ర్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పరకాల డివిజన్ ఇన్‌స్పెక్టర్ కవిత, సూపరింటెండెంట్ క్రాంతికుమార్, పూజారులు ముణిందర్, కృష్ణయ్య, చందా వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
200 గజాలు.. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు రూ.14.46 కోట్లు
జనగామ: సాంకేతిక లోపమా.. అధికారుల నిర్లక్ష్యమా తెలియదు కానీ.. 200 గజాల స్థలానికి.. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు రూ.14.46 కోట్లు చూపించారు. దీంతో కస్టమర్ ఖంగుతిన్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ పట్టణానికి చెందిన కారంపూరి శ్రీనివాస్ తనకున్న 200 గజాల స్థలాన్ని లే అవుట్ రెగ్యులరైజేషన్(ఎల్‌ఆర్‌ఎస్) చేసుకునేందుకు 2020 సెప్టెంబర్ 14న రూ.1,000 ఫీజు చెల్లించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం 25 శాతం రాయితీతో ఎల్‌ఆర్‌ఎస్ పూర్తి చేసుకునేలా అవకాశం కల్పించింది. ఈనెల 26న ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించేందుకు వెబ్‌సైట్ ఓపెన్ చేయగా.. 14 శాతం ఓపెన్ ప్లేస్, రెగ్యులరైజేషన్, ప్లాట్ మార్కెట్ విలువ కలుపుకుని 25 శాతం రాయితీ అమౌంట్ రూ.90,52,950 మినహాయించి.. మిగతా రూ.14.46 కోట్లు చెల్లించాలని చూపించింది. దీంతో ఒక్కసారిగా టెన్షన్‌కు గురైన శ్రీనివాస్ వెంటనే తనకు తెలిసిన అధికారులకు ఫోన్ చేసి ఈ విషయాన్ని వివరించారు. దీనిపై కలెక్టర్ రిజ్వాన్ బాషాను అడగ్గా రాష్ట్రంలో పలుచోట్ల ఇలాగే వచ్చినట్లు సమాచారం ఉందని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కరెక్టు చేసేలా చూస్తామన్నారు.
అమ్మవార్ల బంగారం, వెండి తూకం


