● బ్రహ్మశ్రీ తాటిపాముల నర్సింహమూర్తి
మహబూబాబాద్ రూరల్: విశ్వావసునామ సంవత్సరంలో సామాన్యమైన వర్షాలు కురుస్తాయి. గోదావరి లాంటి నదులు బాగా ప్రవహిస్తాయి. ఆహార ధాన్యాలు, బంగారానికి విపరీతమైన గిరాకీ ఉండి ధరలు బాగా పెరుగుతాయి. వ్యవసాయ రంగంలో మొదటి పంటల కంటే రెండో పంటలు బాగా పండుతాయి. రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుంది. ప్రముఖ వ్యక్తులకు అరిష్టం కలుగుతుంది. మిర్చి, కందులు, బొబ్బెర్లు వచ్చే ఏడాది బాగా పండుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తాయి. ప్రజలు మంచి కలగడం కోసం సుదర్శన, రుద్ర, చండీయాగాలు చేయాలి. పలు రకాల ఆందోళనలు నెలకొననున్నప్పటికీ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది.


