టోల్‌గేట్ చార్జీల్లో మార్పులు
కురవి: కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్‌గేట్ల వద్ద సోమవారం అర్ధరాత్రి నుంచి చార్జీలను మార్పులు చేసింది. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం చింతపల్లి టోల్‌ప్లాజా మీదుగా రాకపోకలు సాగించే వివిధ వాహనాల ధరల్లో మార్పులు ఇలా ఉన్నాయి. కారు, జీప్, వ్యాన్, లైట్ మోటర్ వెహికల్ సింగిల్ జర్నీకి రుసుం రూ.45, ఒక రోజు లోపు తిరుగు ప్రయాణానికి రూ. 65 నుంచి రూ.70కి పెరిగింది. నాన్‌స్టాపింగ్ వెహికల్ పెనాల్టీ వర్తిస్తుంది రూ.90 నుంచి రూ.25, లైట్ కమర్షియల్ వెహికల్ లేదా గుడ్ వెహికల్ లేదా మినీ బస్సు రుసుం రూ.70 ఉండగా కొత్తది రూ.75 పెంచారు. బస్సు, ట్రక్ వాహనాలకు రుసుం రూ.150 ఉంది. ఇందులో పెరుగలేదు. మూడు యాక్సిల్ వాణిజ్య వాహనాలు రుసుం రూ.165 ఉంది. ఇందులో పెరుగలేదు. హెవీ వాహనాలకు రుసుం రూ.240 ఉంది. భారీ వాహనాలకు రుసుం రూ.290 ఉంది. ఇందులో పెరుగలేదు.
జవహర్‌నగర్ టోల్‌గేట్‌లో..
వెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటాపురం మండలం జవహర్‌నగర్ టోల్‌గేట్‌లో గతంలో కారుకు ఆప్ అండ్ డౌన్ రూ.60 ఉండగా ప్రస్తుతం రూ.70, డీసీఎంకు రూ.130 ఉండగా రూ.145, బస్సుకు రూ.165 ఉండగా రూ.180. లారీకి రూ.310 ఉండగా రూ.330 పెరిగినట్లు టోల్‌గేట్ సిబ్బంది తెలిపారు. అయితే సిస్టంలో ధరలు అప్‌లోడ్ కాలేదని, అధికారికంగా ఇంకా ఫైనల్ కాలేదన్నారు.
ముత్తోజిపేట టోల్‌గేట్‌లో..
నర్సంపేట: ముత్తోజిపేట టోల్‌గేట్ వద్ద అధికారులు ధరలు స్వల్పంగా పెంచారు. కారు, జీప్, చిన్న మోటారు వాహనాల చార్జీలు యథావిధిగా ఉండగా, భారీ వాహనాలకు మాత్రం రూ. 5 చార్జీ పెంచారు. భారీ వాహనాలకు రూ. 10 పెంచారు. 3 65 హైవేపై 33కిలో మీటర్ల పరిధిలో ఈ చార్జీలు వ సూలు చేస్తున్నట్లు సోమవారం సాయంత్రం వెల్ల డించిన సర్క్యూలర్‌లో అధికారులు పేర్కొన్నారు.
సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి..


