ప్రమాదవశాత్తు కారు దగ్ధం
మల్హర్ : ప్రమాదవశాత్తు ఓ కారు దగ్ధమైంది. ఈ ఘటన మండలంలోని కొయ్యూరు పీవీనగర్ అడవి సోమన్‌పల్లి మానేరు బ్రిడ్జి వద్ద మంగళవారం చోటు చేసుకుంది. కొయ్యూరు ఎస్సై నరేశ్ కథనం ప్రకారం.. టీఎస్18సీ 2008 నంబర్ గల కారు భూపాలపల్లి నుంచి మంథని వైపునకు వెళ్తుంది. ఈక్రమంలో కొయ్యూరు పీవీనగర్ సమీపంలోని మానేరు బిడ్జ్రి వద్ద పొగలు రావడంతో కారులో ప్రయాణిస్తున్న వారు గమనించి కిందికి దిగారు. ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో వారు వెంటనే ఫైరింజన్‌కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పారు. అయితే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. కాగా, కారులో ప్రయాణిస్తున్న నలుగురు పొగలు రావడం గమనించి కిందకి దిగడంతో పెనుప్రమాదం తప్పంది. ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
● తప్పిన పెను ప్రమాదం..
● మానేరు బ్రిడ్జి వద్ద ఘటన


