అర్హులకు రేషన్ కార్డులు అందిస్తాం
మహబూబాబాద్ రూరల్: అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని, ఇది నిరంతరాయంగా కొనసాగుతుందని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి గ్రామంలో మంగళవారం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. లబ్ధిదారులకు ఆయన స్వయంగా బియ్యం పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తూనే.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, నిరుపేదలకు సన్నబియ్యంతో కూడిన ఆహారం అందుతుందన్నారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి రేషన్ కార్డులు అందించి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తహసీల్దార్ భగవాన్ రెడ్డి, ఆర్‌ఐ కృష్ణప్రసాద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మిట్టకంటి రామిరెడ్డి, మాజీ ఎంపీటీసీ భూక్య రామచందర్, మాజీ సర్పంచ్ ఇస్లావత్ బాలాజీ, భూక్య దళ్ సింగ్, గడిసందు అశోక్, రాంపిల్ల నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
సన్నబియ్యం పంపిణీ
కార్యక్రమం ప్రారంభం


