గిరిజనుల పక్షాన ఎల్‌హెచ్‌పీఎస్ పోరాటం
నెహ్రూసెంటర్: గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం లంబాడీ హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) పోరాడుతుందని ఆ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ బోడ లక్ష్మణ్‌నాయక్ తెలిపారు. జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు ఆంగోత్ చందూలాల్ అధ్యక్షతన గురువారం సంఘ సమావేశం నిర్వహించారు. లక్ష్మణ్‌నాయక్ మాట్లాడుతూ.. తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయని, 6నుంచి 10శాతం రిజర్వేషన్‌తో పాటు బంజారా భాషకు గుర్తింపు లభించిందన్నారు. లంబాడీలు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా అభివృద్ధి సాఽధించేలా ఎల్‌హెచ్‌పీఎస్ కృషి చేసిందన్నారు. తండాలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించేలా పోరాటాలు నిర్వహించాలని, ఎల్‌హెచ్‌పీఎస్ గిరిజనుల పక్షాన ఉద్యమాలకు సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం బెల్లయ్యనాయక్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సమావేశంలో భూక్య రాంమూర్తి, రమేశ్, మూడు రవినాయక్, అజ్మీరా శ్రీను, తేజావత్ మంగీలాల్, కున్సోత్ దేవేందర్, బోడ చందు, వీరన్న, బానోత్ పవన్ తదితరులు పాల్గొన్నారు.


