● బీజేపీ జిల్లా ఎన్నికల ఇన్‌చార్జ్
శ్రీవర్ధన్‌రెడ్డి
మహబూబాబాద్ అర్బన్: సన్న బియ్యం అందిస్తున్న ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని బీజేపీ జిల్లా ఎన్నికల ఇన్‌చార్జ్ శ్రీవర్ధన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి విస్తృత సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు తాము రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ ప్రతీ ఒక్కరికి 5కిలోల బియ్యం కేంద్రం అందిస్తుందని, రాష్ట్రం కిలో మాత్రమే అందిస్తుందని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కమీషన్ల కోసం పనిచేస్తూ.. ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. హామీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఎందుకు అమ్ముతున్నారని ప్రజలు, యువకులు కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలని కోరారు. ఈ నెల 6న బూత్‌స్థాయిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించి, ప్రతీ కార్యకర్త తమ ఇంటిపై పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శ్యామ్‌సుందర్ శర్మ, జిల్లా మాజీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒద్దిరాజు రాంచందర్‌రావు, చీకటి మహేశ్, మాజీ జెడ్పీటీసీ సంగీత, నాయకులు గడ్డం అశోక్, సత్యనారాయణ, నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు.
నేడు బాబుజగ్జీవన్‌రామ్ జయంతి
మహబూబాబాద్ అర్బన్: భారతదేశ మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబుజగ్జీవన్‌రామ్ 118 జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ సెంటర్‌లో శనివారం ఉదయం 9గంటలకు నిర్వహిస్తున్నుట్ల జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి నర్సింహారావు శుక్రవారం తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ కుల సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని, హాజరై విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు.
సన్న బియ్యం భోజనం పరిశీలన
మహబూబాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. ఈమేరకు శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ సన్నబియ్యంతో వండిన భోజనాన్ని పరిశీలించారు. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామంలో రేషన్ కార్డు లబ్ధిదారులు కొప్పుల కలమ్మ–సమ్మయ్య ఇంటికి వెళ్లి వారు ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంతో వండిన అన్నం తిన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
భద్రకాళి అమ్మవారికి గులాబీలతో అర్చన
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఎరుపు రంగు గులాబీపూలతో అమ్మవారికి అర్చన చేశారు. ఉదయం అర్చకులు అమ్మవారికి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం నిర్వహించారు. పుష్పార్చన కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఉభయదాతలుగా వ్యవహరించారు. ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ శేషుభారతి, దేవాలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పుష్‌పుల్ రైలును
పునరుద్ధరించండి : ఎంపీ
హన్మకొండ చౌరస్తా: వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు పుష్‌పుల్ రైలు సర్వీసును పునరుద్ధరించాలని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్‌ను ఎంపీ కావ్య కోరారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఢిల్లీలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు నిత్యం వందల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు, దినసరి కూలీలు వెళ్తుంటారని, వారి అవసరాల దృష్ట్యా పుష్‌పుల్ రైలు సర్వీసు పునరుద్ధరించడంతోపాటు బోగీల సంఖ్య పెంచాలని కోరారు.
సన్నబియ్యం ఘనత కేంద్ర ప్రభుత్వానిదే..


