● డీఎంహెచ్‌ఓ రవి
నెహ్రూసెంటర్: యాక్షన్‌ప్లాన్ ద్వారా వ్యాధి నిరోధక టీకాలను పంపిణీ చేయాలని డీఎంహెచ్‌ఓ రవి అన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో మైక్రో యాక్షన్‌ప్లాన్‌పై శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. జిల్లాలో వ్యాధి నిరోధక టీకాల పంపిణీ వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. సూపర్‌వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలకు, ఆశా కార్యకర్తలకు టీకాలపై వివరించాలన్నారు. ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో ఈ నెల 7నుంచి పుట్టిన పిల్లల నుంచి 6 సంవత్సరాల పిల్లల వరకు అంగన్‌వాడీలో ఉన్న పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి లక్ష్మీనారాయణ, ఆర్‌బీఎస్‌కే కోఆర్డినేటర్ కుమార్, డెమో ప్రసాద్, ఎస్‌యూఓ శ్రీనివాస్, హెచ్‌ఈ శారద, గీత, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.


