కురవి: ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్యాంగ పరిరక్షణకు కృషిచేయాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ అన్నారు. శుక్రవారం సీరోలు మండలం చింతపల్లి గ్రామంలో జై బాపు..జై భీమ్...జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం అనేక హక్కులను కల్పించిందన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతుందన్నారు. దానిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ వస్తుందన్నారు. పేద ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని, ప్రధాని నరేంద్రమోదీ కార్పొరేట్‌శక్తుల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ అణగదొక్కాలని చూస్తుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, కాంగ్రెస్ సీరోలు మండల అధ్యక్షుడు కొండపల్లి కరుణాకర్‌రెడ్డి, జెర్రిపోతుల మహేశ్, కాలం రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్


