గిరిజనులపై చిన్న చూపు వీడండి
సాక్షి, మహబూబాబాద్ : గిరిజనులు అంటే ఇంకా సమాజంలో చిన్నచూపు ఉంది.. అధికారుల్లో కూడా అటువంటి ధోరణి ఉండటం సమంజసం కాదు.. చిన్న చూపు వీడి వారి అభ్యున్నతికి పాటుపడాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సంక్షేమ పథకాల అమలు, ఎస్టీలపై కేసులు మొదలైన అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుంచి పెద్ద అధికారుల వరకు సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు. భూ సమస్యలు పరిష్కరించకుండా సంవత్సరాల తరబడి గిరిజనులను తిప్పించుకుంటున్నారని అన్నారు. గిరిజన కాలనీల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నా.. వాటిని పరిష్కరించడం లేదని పలు సమస్యలను గుర్తు చేసి వినిపించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఐటీడీఏ పీడీ చిత్ర మిశ్రా, ఎస్పీ సుధీర్ రాంనా ధ్ కేకన్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు
జాటోత్ హుస్సేన్ నాయక్


