విద్యావేత్త కాసం అంజయ్య మృతి
జనగామ: ప్రముఖ విద్యావేత్త, పూర్వ లయన్ జిల్లా గవర్నర్ కాసం అంజయ్య(80) ఆదివారం మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు ముగ్గురు సోదరులు, ఒక కుమారుడు ఉన్నారు. అంజయ్య మరణ వార్తతో విశ్వ విద్యాలయాలు, కళాశాలల ఫ్రొఫెసర్లు, అధ్యాపకులు, లయన్ ప్రముఖులు అంతిమ వీడ్కోలుకు తరలివచ్చారు. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన కాసం అంజయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి వాణిజ్య శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. 1966లో వరంగల్ సీకేఎం కళాశాలలో అసిస్టెంట్ లెక్చరర్‌గా అధ్యాపక వృత్తి ప్రారంభించి.. కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 1976లో లయన్స్ అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థను జనగామలో స్థాపించి వ్యవస్థపాక కార్యదర్శిగా పని చేశారు. 1989లో జిల్లా గవర్నర్ పదవి చేపట్టారు. ఆయన మార్గదర్శనంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో లయన్స్ క్లబ్‌లు విస్తరించాయి. ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న 1975 సమయంలో జనగామలో ఏర్పాటు చేసిన ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వ్యవస్థాపక ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. రెండు దశాబ్దాలకు పైగా పని చేసిన ఆయన 2001లో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ పొందారు. ఆవోపా సంస్థ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి అనతి కాలంలోనే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
కేయూ మాజీ వీసీ, ప్రముఖుల నివాళి
అంతిమ వీడ్కోలుకు ప్రముఖులు
అంజయ్య అంతిమ వీడ్కోలుకు అనేక ప్రాంతాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వీసీ ప్రొఫెసర్ వి.గోపాల్‌రెడ్డి, పూర్వ ఆచార్యులు టి.సుధాకర్ రెడ్ది, రమణయ్య, శంకరయ్య, పూర్వ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రుమాల్ల సునీల్‌కుమార్, మల్టీపుల్ కౌన్సిల్ మాజీ చైర్మన్లు ఎం.విద్యాసాగర్‌రెడ్డి, తీగల మోహన్‌రావు, లయన్ పూర్వ జిల్లా గవర్నర్ కన్న పరశురాములు, కుందూరు వెంకట్‌రెడ్డి, చంద్ర శేఖర్ ఆర్య, ఎన్.సుధాకర్‌రెడ్ది, పి.హరికిషన్‌రెడ్డి, కె.గోవింద్‌రాజ్, వెంకటేశ్వరరావు, కె.సి.జాన్ బన్నీ, ముచ్చ రాజిరెడ్ది, టి.లక్ష్మీనరసింహరావు, రాజేందర్‌రెడ్డి, సత్యనారాయణ, ప్రతాప్ రెడ్డి, అల్లాడి ఈశ్వర్‌రావు, ప్రభాకర్‌రావు, కుర్రెముల యాదగిరి, నాగబండి రవీందర్, డాక్టర్ రాజమౌళి తదితరులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
విద్యావేత్త కాసం అంజయ్య మృతి


