పెండింగ్ డీఏలు విడుదల చేయాలి
మహబూబాబాద్ అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో ఆదివారం జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవీ విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్ బెనిఫిట్స్ విడుదల కావడం లేదన్నారు. మొదటి పీఆర్సీ గడువు జూలై 2023లో ముగిసినప్పటికీ నేటికి పీఆర్సీ నివేదికను తెప్పించుకొని వేతనాలను సవరించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చాప దొరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, జిల్లా నాయకులు భాస్కర్, దేవేందర్‌రాజు, లక్ష్మయ్య, సునీత, తిరుమలేశ్, మాధవ్, శ్రీనివాస్ , భీముడు, రాజు, నిర్మల, ఉపేందర్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. లింగారెడ్డి


