గవర్నర్ చేతుల మీదుగా జ్ఞాపిక ప్రదానం
చిన్నగూడూరు: మండలంలోని జయ్యారం గ్రామానికి చెందిన వెల్లె శ్రీనివాస్ తయారు చేసిన ‘కిసాన్ రిమోట్’ పరికరానికి గాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా జ్ఞాపికను అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ‘ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్’, ‘పల్లె సృజన’ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సమ్మేళనంలో తాను తయారు చేసిన ఇన్నోవేషన్(కిసాన్ రిమోట్)ను ప్రదర్శించినందుకు గవర్నర్ శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు ‘కిసాన్ రిమోట్’ పరికరం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.


