మహేందర్‌బాబుకు ప్రొఫెషనల్ ఎక్స్‌లెన్స్ అవార్డు
మహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని గుమ్మడూరుకు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి సూర్ణపు ముత్తయ్య, సుగుణ దంపతుల కుమారుడు మహేందర్ బాబుకు రైసింగ్ ఇండియా ప్రొఫెషనల్ ఎక్స్‌లెన్స్ అవార్డు–2025 అందజేశారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో సీనియర్ నాన్ కమిషనర్ ఆఫీసర్ హోదాలో దేశానికి చేస్తున్న సేవలను గుర్తించి అతడిని అవార్డుతో సత్కరించారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషనల్ క్లబ్ స్పీకర్ హాల్‌లో ఆదివారం రాత్రి జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో లోక్ సభ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రాజేష్ శర్మ, రక్షణశాఖ అధికారి కమాండర్ జ్ఞానేంద్ర శర్మ వీఎస్‌ఎం రైసింగ్ ఇండియా ప్రొఫెషనల్ ఎక్స్‌లెన్స్ అవార్డును మహేందర్ బాబుకు ప్రదానం చేశారు.


