హనుమకొండ కలెక్టరేట్‌ పార్కుకు ఉత్తమ అవార్డు | - | Sakshi

హనుమకొండ కలెక్టరేట్‌ పార్కుకు ఉత్తమ అవార్డు

Apr 8 2025 7:41 AM | Updated on Apr 8 2025 7:41 AM

హనుమకొండ కలెక్టరేట్‌ పార్కుకు ఉత్తమ అవార్డు

హనుమకొండ కలెక్టరేట్‌ పార్కుకు ఉత్తమ అవార్డు

హన్మకొండ అర్బన్‌: హనుమకొండ కలెక్టరేట్‌లోని పార్కుకు రాష్ట్ర ఉద్యానశాఖ ద్వారా నిర్వహించిన 8వ గార్డెన్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ గార్డెన్‌గా అవార్డు ల భించినట్లు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధి కారి వెంకటేశం తెలిపారు. సంబంధిత గోల్డెన్‌ ట్రో ఫీ, సర్టిఫికెట్‌ను కలెక్టర్‌ ప్రావీణ్య అధికారుల సమక్షంలో ప్రదర్శించారు. సుమారు 114 రకాల పూలు, నీడనిచ్చే మొక్కలను నాటి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడమేకాకుండా వాటి రక్షణ చర్యలు చేపడుతూ రాష్ట్రస్థాయి అవార్డు పొందడంపై అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి, డీఆర్‌ ఓ వై.వి గణేష్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కరపత్రాల ఆవిష్కరణ..

ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన వేసవిలో జాగ్రత్తలు (ఎండ వేడి తీవ్రత నుంచి ఉపశమనం, ఉపాయాలు), కృత్రిమ రసాయన శీతల పానీయాలు నివారించాలనే కరపత్రాలను సోమవారం కలెక్టర్‌ ప్రావీణ్య ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆచార్య లక్ష్మారెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కాజీపేట పురుషోత్తం, ఉపాధ్యక్షులు రాములు, ఉమామహేశ్వర్‌ రావు, కోశాధికారి పరికిపండ్ల వేణు, కార్యవర్గ సభ్యులు వకుళాభరణం శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement