సకాలంలో మిర్చి కొనుగోళ్లు చేపట్టాలి
మహబూబాబాద్ రూరల్ : రైతుల అవసరాలు, ఇబ్బందులు గుర్తించి సకాలంలో మిర్చి కొనుగోళ్లు చేపట్టాలని మార్కెటింగ్ శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ (ఆర్డీడీఎం) పద్మావతి అన్నారు. ఈమేరకు సో మవారం మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా క్రయవిక్రయాల తీరును పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతులు, వ్యాపారుల అవసరాల మేరకు మార్కెట్ యార్డు ప్రాంగణంలో వసతుల కల్పనపై దృష్టి సారిస్తామన్నారు. మిర్చి, మక్కలు, ధాన్యం, పత్తి, అపరాలు కొనుగోళ్ల సందర్భంలో రైతులకు వ్యాపారులు సహకరించాలని కో రారు. అనంతరం ఈ ఏడాది సీజన్‌లో జరిగిన మి ర్చి క్రయవిక్రయాలు, మార్కెట్ ఆదాయంపై రికా ర్డులు తనిఖీ చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ, సెక్రటరీ షంషీర్, సూపర్‌వైజర్ రమేశ్, అసిస్టెంట్ సూపర్‌వైజర్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు.
మార్కెటింగ్ శాఖ రీజినల్ డిప్యూటీ
డైరెక్టర్ పద్మావతి


