పెండింగ్ బిల్లులు చెల్లించాలి
● మాజీ మంత్రి సత్యవతిరాథోడ్
నెహ్రూసెంటర్: గ్రామాల అభివృద్ధికి పాటుపడిన తాజా మాజీ సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ కోరారు. కురవి మండలం కాకులబోడుతండా తాజా మాజీ సర్పంచ్ భర్త కిషన్‌నాయక్ అప్పులపాలై ఆత్మహత్య చేసుకోగా మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. బిల్లులు రాక అప్పుల పాలై చనిపోవడం బాధాకరమన్నారు. మరెవరూ అప్పులబాధతో మృతిచెందకుండా బిల్లులు విడుదల చేయాలని, ప్రభుత్వం కిషన్‌నాయక్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి కన్నీటి పర్యంతమయ్యారు. బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.


