ఆర్టీసీ బలోపేతానికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బలోపేతానికి కృషి చేయాలి

Apr 9 2025 1:24 AM | Updated on Apr 9 2025 1:40 AM

ఆర్టీ

ఆర్టీసీ బలోపేతానికి కృషి చేయాలి

నెహ్రూసెంటర్‌: ఆర్టీసీ బలోపేతానికి ఉద్యోగులు, సిబ్బంది కృషి చేయాలని ఆర్టీసీ వరంగల్‌ రీజనల్‌ మేనేజర్‌ విజయభాను అన్నారు. ప్రగతిచక్ర త్రైమాసిక అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం డిపో ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కోసం ఉద్యోగులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. డిపోకు చెందిన ఆర్‌. శ్రవణ్‌కు ఉత్తమ వెల్డర్‌ అవార్డును ప్రదానం చేశారు. కార్యక్రమంలో డిపో మేనేజర్‌ ఎం.శివప్రసాద్‌, శ్రీనివాస్‌, పాపిరెడ్డి, వెంకన్న, నరసయ్య, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

జీపీ కార్మికుల

సమస్యలు పరిష్కరించాలి

మహబూబాబాద్‌: గ్రామ పంచాయతీ కార్మి కుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్‌ యూ నియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.రవి డిమాండ్‌ చేశా రు. యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం డీపీఓ హరిప్రసాద్‌కు సమ్మె నోటీస్‌ అందజేశారు. ఈసందర్భంగా రవి మాట్లాడుతూ.. ప్ర భుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈనెల 17న రాష్ట్ర వ్యాప్తంగా టోకెన్‌ సమ్మె చేపడుతున్నామన్నారు. మృతిచెందిన ప్రతీ జీపీ కార్మికుడి కుటుంబా నికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జీఓ నంబర్‌ 51ని సవరించి పాత పద్ధతిలో విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టాలన్నారు. సూర్యం, బీకు, యాకయ్య, రంగయ్య పాల్గొన్నారు.

జిల్లా కమిటీ ఎన్నిక

మహబూబా బాద్‌ అర్బన్‌: వ్యాయామ విద్య ఉ పాధ్యాయుల (పీడీ) సంఘం జిల్లా కమిటీని ఏ కగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి ఓలేటి జ్యోతి మంగళవారం తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా కొప్పుల శంకర్‌, ప్రధాన కార్యదర్శిగా చెడుపల్లి ఐలయ్య, కోశాధికారిగా డి.సునీల్‌ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ అధ్యక్షుడు సత్యనారాయణ, పీడీలు తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

మహబూబాబాద్‌ అర్బన్‌: పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కోసం 2024–25 విద్యా సంవత్సరానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి నర్సింహస్వామి మంగళవారం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఈబీసీ విద్యార్థులు పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కోసం మే 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

విద్యార్థి దశలోనే

లక్ష్యం ఎంచుకోవాలి

అర్జున అవార్డు గ్రహీత దీప్తి జీవాంజి

మహబూబాబాద్‌ అర్బన్‌: విద్యార్థి దశలోనే లక్ష్యం ఎంచుకొని ముందుకెళ్తే విజయం సాధించవచ్చని అర్జున అవార్డు గ్రహీత దీప్తి జీవాంజి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలో మంగళవారం జరిగిన కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని.. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ మధు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రైవేట్‌గా

ఐటీఐ చేసే అవకాశం

మహబూబాబాద్‌ అర్బన్‌: ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న కార్మికులు ప్రైవేట్‌గా ఐటీఐ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని మానుకోట ప్రభుత్వ ఐటీఐ కళా శాల ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ ఎన్‌. బాబు మంగళవారం తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో మూడేళ్లకుపైగా సర్వీస్‌పూర్తి చేసిన అభ్యర్థులు వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవడం కో సం తగిన శిక్షణ ఇప్పించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఆసక్తిగలవారు నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తులు అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు మానుకోట జిల్లా ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సంప్రదించాలన్నారు.

ఆర్టీసీ బలోపేతానికి  కృషి చేయాలి1
1/2

ఆర్టీసీ బలోపేతానికి కృషి చేయాలి

ఆర్టీసీ బలోపేతానికి  కృషి చేయాలి2
2/2

ఆర్టీసీ బలోపేతానికి కృషి చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement