యాంటీ బయాటిక్స్‌తో పశువులకు ముప్పు
మామునూరు: అధిక పాల దిగుబడి కోసం విచక్షణారహితంగా యాంటీ బయాటిక్స్ వినియోగిస్తే పశువులు, ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిళ్లుతుందని మామునూరు కేవీకే సీనియర్ శాస్త్రవేత్త, కోఆర్డి నేటర్ రాజన్న అన్నారు. ఖిలా వరంగల్ మండలం మామునూరు పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వ విద్యాలయంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కేవీకే, సద్గురు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ‘యాంటీ మెక్రోబియల్ నిరోధకత– పరిష్కారాలు’ అనే అంశంపై పాడి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం డాక్టర్ వంశీకృష్ణ యాంటీ బయాటిక్స్ వినియోగం, వాటి మోతాదు, ఎక్కువ వాడితే కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అంతకు ముందు పశువుల పాకల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, షెడ్డు నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన విషయాలపై డాక్టర్ అమృత్‌కుమార్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వరప్రసాద్, కై లాశ్, సాయికిరణ్, శాస్త్రవేత్తలు, పాడి రైతులు పాల్గొన్నారు
కేవీకే శాస్త్రవేత్త రాజన్న


