‘పురోగతి’లో ముందు వరుస..
కేసముద్రం: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా 2022–23నాటికి దేశంలోని గ్రామపంచాయతీలు సాధించిన పరోగతి ఆధారంగా కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ విడుదల చేసిన పురోగతి సూ చికలో మండలంలోని కల్వల గ్రామం ఆరో స్థానంలో నిలిచింది. పేదరిక నిర్మూలన, పంచాయతీలో జీవనోపాధి పెంపు,ఆరోగ్యం,చిన్నారులకు సౌకర్యా ల కల్పన, తాగునీరు,పారిశుద్ధ్యం, పచ్చదనం, మౌ లిక వసతుల్లో స్వావలంబన, సామాజిక భద్రత, సుపరిపాలన,మహిళలకు అనుకూలమైన విధానా లు అనే తొమ్మిది అంశాలను కొలమానంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందంతో సర్వే నిర్వహించింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసి న పంచాయతీ పురోగతి సూచికలో కల్వల జీపీ 80.82 మార్కులు సాధించి రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచింది.క్లీన్‌అండ్‌గ్రీన్‌లో భాగంగా,ప్రతీ ఇంటి కి ఆరు మొక్కలను పంపిణీ చేసి, అవి బతికే విధంగా చూడడం, తడిచెత్త నుంచి ఎరువుల తయారీ వంటి కార్యక్రమాలను అప్పటి సర్పంచ్ గంట సంజీవరెడ్డి, కార్యదర్శి అరుణ్‌జ్యోతి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ మేరకు కల్వల జీపీ ఆరో స్థానంలో నిలవడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అందరి సహకారంతో అభివృద్ధి
తాజామాజీ గ్రామ సర్పంచ్ గంట సంజీవరెడ్డి, వార్డుసభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశాలు, ఎఎన్‌ఎంలు, సీఏలు, గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వం నిర్వహించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. ఇందులో భాగంగా క్లీన్‌అండ్‌గ్రీన్‌ను విజయవంతంగా నిర్వహించాం. నాటిన ప్రతీ మొక్కను బతికించాం. పురోగతి సూచికలో రాష్ట్రంలోనే కల్వల గ్రామం ఆరో స్థానంలో నిలవడం సంతోషంగా ఉంది.
–అరుణ్‌జ్యోతి, పంచాయతీ కార్యదర్శి, కల్వల
పురోగతి సూచికలో రాష్ట్రంలో
కల్వల జీపీకి ఆరో స్థానం
క్లీన్‌అండ్‌గ్రీన్ అంశంలో ఎంపిక
‘పురోగతి’లో ముందు వరుస..
‘పురోగతి’లో ముందు వరుస..


