తమ్ముడే కాలయముడయ్యాడు..
వాజేడు : సొంత తమ్ముడే కాల యముడయ్యాడు. మద్యం కోసం డబ్బు ఇవ్వలేదనే కారణంతో అన్నను హత్య చేశాడు. అనంతరం తనకేమీ తెలియదన్నట్లు మృతదేహం వద్ద తిరిగాడు. ఈ ఘటన ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని కొత్త టేకులగూడెంలో జరిగింది. వెంకటాపురం(కె) సీఐ బండారి కుమార్, పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వాసం అచ్చయ్య, లక్ష్మి దంపతులకు ముగ్గురు కొడుకులు విజయ్‌బాబు(30), బుల్లెబ్బాయి (ఆకాశ్), రాజేంద్రప్రసాద్ ఉన్నారు. ఇద్దరు తమ్ముళ్లకు పెళ్లిళ్లు కాగా పెద్ద కొడుకు విజయ్‌బాబు వివాహం చేసుకోలేదు. అతడు తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. రెండో కొడు కు బుల్లెబ్బాయి(ఆకాశ్) తన భార్య కాన్పు నిమిత్తం తన అత్తగారింటికి వెళ్లగా ఇతను కూడా తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో విజయ్ బాబు పనికి వెళ్లాడు. మంగళవారం రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేసిన అనంతరం నిద్రించాడు. అ ప్పటికే మద్యం మత్తులో ఉన్న బుల్లెబ్బాయి.. అన్న విజయ్‌బాబును మద్యానికి డబ్బు ఇవ్వాలని అడగా అతడు తన వద్ద లేవని చెప్పి నిద్రించాడు. దీంతో కోపోద్రెకుడైన బుల్లెబ్బాయి.. విజయ్‌బాబుతో గొడవ పడి పదునైన ఆయుధంతో ముఖంపై కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన విజయ్‌బా బు మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకు న్న పోలీసులు బుధవారం ఉదయం ఘటనా స్థలికి చేరకుని పరిశీలించారు. వివరాలను సేకరించే సమయంలో బుల్లెబ్బాయి అక్కడే ఉండి తనకు ఏమీ తెలియదనట్లు నటించాడు. ఈ ఘటనపై చిన్న తమ్ముడు రాజేంద్రప్రసాద్ ఫిర్యాదు మేరకు బుల్లెబ్బాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు. కాగా, బుల్లెబ్బాయి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
మద్యం కోసం డబ్బు ఇవ్వలేదని అన్నను చంపిన తమ్ముడు
టేకులగూడెంలో ఘటన


