కేయూ బంద్ విజయవంతం
కేయూ క్యాంపస్: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్‌చేసి 21జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నత విద్యామండలి ముట్టడికి పిలుపునివ్వగా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విధితమే. దీనికి నిరసనగా గురువారం కేయూలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన బంద్ విజయవంతమైంది. క్యాంపస్‌లోని ప్రిన్సిపాల్ కార్యాలయం, పరీక్షల విభాగం, ఆడిట్, యూజీసీ తదితర కీలక విభాగాలన్నింటినీ బంద్ చేయించారు. అలాగే, యూనివర్సిటీ పరిధిలోని పలు కాలేజీలను కూడా బంద్ చేయించారు. అనంతరం క్యాంపస్‌లోని పరిపాలనాభనం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోఆర్డినేషన్ కమిటీ బాధ్యులు పి. కరుణాకార్‌రావు, సాధురాజేశ్, శ్రీధర్‌కుమార్‌లోథ్, బి.సతీశ్, మాదాసి కనకయ్య మాట్లాడుతూ కొన్నేళ్లుగా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నవారిని రెగ్యులరైజ్‌చేయాలన్నారు. తమకు ఉద్యోగభద్రత కల్పించాకే కొత్తగా అధ్యాపక పోస్టులను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. కాగా, రిజిస్ట్రార్ రామచంద్రం మాట్లాడుతూ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆశీర్వాదం, సంకినేని వెంకట్, భిక్షపతి, రవీందర్, గడ్డం కృష్ణ, జూలసత్య, నాగయ్య, సూర్యనారాయణ, కవిత, శ్రీదేవి, స్వప్న, వీణ, సునీత, ఆర్‌డీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ధర్నా


