పశుదాణాకు ప్రత్యామ్నాయం..
మహబూబాబాద్ రూరల్ : అజొల్లా.. ఆకుపచ్చ రంగులో ఉండే ఫెర్న్ జాతికి చెందిన మొక్క. దీనిలో మాంసకృత్తులు, లవణాలు, కెరోటిన్, విటమిన్ బీ2 ఎక్కువ ఉంటాయి. ఇది తక్కువ శాతం లిగ్నిన్ కలిగి సులభంగా జీర్ణమవుతుంది. అజొల్లా వాడకం వల్ల పశుదాణా ఖర్చుల్లో 20 నుంచి 25 శాతం తగ్గించొచ్చు.
● వెన్నశాతం, ఎస్‌ఎన్‌ఎఫ్ విలువలు పాలలో పెరుగుతాయి. దీంతో లీటర్ పాలకు రూ.60 పైసల నుంచి రూ. 1.50 వరకు అధిక ఆదాయం పొందొచ్చు.
● అజొల్లాను పాడి పశువులకే కాక గొర్రెలు, కోళ్ల మేతలో కూడా దాణాకు ప్రత్యామ్నాయంగా (బదులు) వాడొచ్చు.
● లూజ్ అజొల్లాను 1:1 నిష్పత్తిలో పశువుల దాణాతో కలిపి వాడొచ్చు. అజొల్లాను ఏ ఇతర పదార్థాలతో కలపకుండా కూడా దాణాగా వాడొచ్చు.
అజొల్లా తయారీ విధానం..
● రోజుకు 4 కిలోల అజొల్లా ఉత్పత్తి చేయడానికి 2.25 x 1.5 మీటర్ల కొలతలతో తొట్టి తయారు చేసుకోవాలి. (2.25 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు), 9 అంగుళాల లోతు.
● 150 జీసీఎం మందం, 2.5 x 1.8 మీటర్ల సైజ్ గల సిల్ఫాలిన్ (షీట్) తొట్టిలో పరచాలి.
● 10 నుంచి 15 కిలోల సారవంతమైన మట్టిని సమానంగా పాలిథీన్ షీట్‌పై పరచాలి. తర్వాత 2 నుంచి 5 కిలోల, రెండు రోజుల ఆరిన పేడ 40 గ్రాములు, సూపర్ పాస్పెట్ 10 లీటర్ల నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని గుంతలో పోసి బాగా కలిపి పెట్టాలి.
● తొట్టిలో 7 నుంచి 10 సెంటీ మీటర్ల ఎత్తు వరకు నీరు ఉండేలా చూసుకోవాలి.
●0.5 కిలోల నుంచి 1 కిలో అజొల్లా మదర్ కల్చ ర్‌ను గుంత అంతా సమానంగా చేయాలి. వేసిన వారం రోజులకు అజొల్లా గుంత అంతా అభివృద్ధి చెందుతుంది.
● కిలో అజొల్లా మదర్ కల్చర్ నుంచి వారం రోజుల్లో 8 నుంచి 10 కిలోల దిగుబడి వస్తుంది. ఏడో రోజు నుంచి అజొల్లాను ప్రతీరోజు వాడుకోవచ్చు.
● వారానికి ఒకసారి కిలో పేడను, 20 గ్రాముల లవ మిశ్రమాన్ని 5 లీటర్ల నీటితో గుజ్జుగా కలిపి తొట్టిలో వేయాలి.
● అజొల్లా పెంచడానికి ప్రత్యేకంగా స్థలం లేనివారు పండ్ల తోటలు, వాటిలో తొట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా షెడ్‌నెట్ల కింద నిర్మించుకోవచ్చు.
● ఉష్ణోగ్రత 20 నుంచి 28 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉండాలి. సూర్యరశ్మి నేరుగా పడకుండా ఆకులు చెత్త గుంతలో పడకుండా షెడ్‌నెట్ ఏర్పాటు చేసుకోవాలి.
● తొట్టిలో తేలియాడుతున్న అజొల్లాను ప్లాస్టిక్ జల్లెడతో బయటకు తీయాలి. తొలుత వారం రోజులకు తర్వాత ప్రతీరోజు అజొల్లా సేకరించొచ్చు. తొట్టి నుంచి తీసిన అజొల్లాను మంచి నీటితో కడిగితే పేడ వాసన రాదు.
అజొల్లాలో ఉండే పోషకాలు..
అజోల్లా డ్రై వెయిట్ బేసిస్ ప్రకారం 25 నుంచి 30 శాతం మాంసకృత్తులు, 10 నుంచి 15 శాతం మినరల్స్, 7 నుంచి 10 శాతం అమైనా ఆసిడ్స్, బయోమాక్టిల్ పదార్థాలు ఉంటాయి.
ఎక్కువ మాంసకృత్తులు, తక్కువ లిగ్నిన్ ఉండడం వల్ల వేగంగా, తేలికగా, తక్కువ ఖర్చుతో పెరుగుతుంది. దీని వల్ల దీనిలోని పోషకాలను పశువులు, కోల్లు, గొర్రెలు తేలికగా జీర్ణం చేసుకుంటాయి.
అజొల్లా గురించి మరింత సమాచారం కోసం మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎన్. కిశోర్‌కుమార్ సెల్ నంబర్ 99594 66904ను సంప్రదించొచ్చు.
వేసవిలో పాడి పశువులకు
దాణాగా వాడొచ్చు
ఈ మొక్కలో మాంసకృత్తులు,
లవణాలు, కెరోటిన్ అధికం
పశుదాణాకు ప్రత్యామ్నాయం..
పశుదాణాకు ప్రత్యామ్నాయం..


