రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజల్లో అసంతృప్తి
గూడూరు: అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి ఏడాదిన్నర పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, తిరిగి కేసీఆర్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో చెరువులన్నీ చేపలతో నిండుకొని, పంటలన్నీ పచ్చగా ఉండగా, నేటి కాంగ్రెస్ పాలనలో చెరువులు, బావులు, బోర్లలో నీరు అడుగంటి పంటలు ఎండిపోతున్నాయన్నాని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ రైతులకు కష్టాలు మొదలయ్యాయని వాపోయారు. ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు మండలం నుంచి 10వేల మందిని తరలించేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. అనంతరం సభకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వేం వెంకటక్రిష్ణారెడ్డి, ఎండి ఖాసీం, మోతీలాల్, నూకల సురేందర్, కిషన్‌నాయక్, కఠార్‌సింగ్, నర్సింహనాయక్, సంపత్‌రావు, వెంకన్న, రవి తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సత్యవతిరాథోడ్


