రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కురవి: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. శనివారం సీరోలు మండలం రేకులతండా, సీరోలు, కాంపల్లి తదితర గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సీరోలులో జై బాపు..జైభీమ్..జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. రైతులు పండించిన వరిధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించామని, సన్నధాన్యానికి బోనస్ కూడా అందిస్తున్నామన్నారు.పేదల కడుపు నింపేందుకు సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా రు. ఈ కార్యక్రమంలో సీరోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండపల్లి కరుణాకర్‌రెడ్డి, ఎంపీఓ గౌస్, మానుకోట మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, నాయకులు వి.హర్షవర్థన్‌రెడ్డి, కాలం రవీందర్‌రెడ్డి, కొప్పుల వెంకటరెడ్డి, రమేశ్, జెరిపోతుల మహేష్‌గౌడ్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
తరుగు పేరుతో గత ప్రభుత్వం దగా
మరిపెడ రూరల్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాలు, తరుగు పేరుతో రైతాంగాన్ని దగా చేసిందని, క్వింటాకు 10కిలోల తరుగు చొప్పున కట్ చేసి లక్షల రూపాయలు దోచుకున్నారని ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ ఆరోపించారు. మండలంలోని వీరారం, తాళ్లఊకల్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు వంటికొమ్ము యుగేందర్‌రెడ్డి, దిగజర్ల పట్టాబి, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రునాయక్


